శ్లోకం - 60

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః | ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రుడా, ఇంద్రియములు ఎంతో శక్తిగలవి. ఆత్మ జ్ఞానం కలిగి విషయ సుఖములపైన నిగ్రహంగా ఉండేందుకు అమితంగా ప్రయత్నించే పండితుడి మనస్సుని కూడా ఇంద్రియముల వైపు బలవంతంగా లాక్కోని పోగలవు.