శ్లోకం - 62

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే | సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో௨భిజాయతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక వాంఛల గురించి ఆలోచించినప్పుడు మానవునికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి నుండి కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం కలుగును.