శ్లోకం - 63

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్రోధం వలన వ్యామోహము కలుగును. దాని వలన స్మృతి(జ్ఞాపకశక్తి) నశిస్తుంది. స్మృతి నశించడం వలన బుద్ధి(తెలివి) నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మానవుడు పతనమౌతాడు.