శ్లోకం - 66

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా | న చాభావయత శ్శాంతిః అశాంతస్య కుతస్సుఖమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుని యందు ద్యాస లేని వానికి స్థిరమైన బుద్ధి కలగదు. అలాంటి వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు కలుగును?