శ్లోకం - 67

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో௨ను విధీయతే | తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే నీటి మీద బలమైన గాలికి పడవ దాని దిశ నుండి పక్కకు నెట్టివేయబడునో, అలాగే ఇంద్రియ సుఖముల యందు మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.