శ్లోకం - 69

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏదైతే సర్వజీవులకు రాత్రియో అది ఆత్మనిగ్రహము కలిగిన మునికి మేల్కొని ఉండు సమయము. అలాగే సమస్త ప్రాణులకు ఏది మేల్కొని ఉండు సమయయో అది ఆత్మనిష్ఠకలిగిన మునికి రాత్రి అవుతుంది.