శ్లోకం - 70

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ | తద్వత్‌కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిరంతరం అనేక నదులు సముద్రంలో కలుస్తున్నా కూడా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అలాగే తన చుట్టూ ఎన్నో ప్రాపంచిక సుఖములు ఉన్నప్పటికీ నిగ్రహము కలిగిన వాడు శాంతిని పొందుతాడు. భోగములకు బానిస అయినవాడికి మోక్షం లభించదు.