శ్లోకం - 71
విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః | నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఇంద్రియ సుఖములకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టి, అత్యాశ, అహంకారం, మమకారం లేకుండా ఉంటాడో అట్టి వానికి నిజమైన శాంతి లభిస్తుంది.