శ్లోకం - 1
అర్జున ఉవాచ: జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన | తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా(కృష్ణా), సకామ కర్మల కంటే జ్ఞానమే గొప్పదని మీరు సూచిస్తున్నారా? అలా అయితే, ఈ భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?