శ్లోకం - 3
శ్రీ భగవానువాచ: లోకే௨స్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా௨నఘ | జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ లోకము నందు దైవ ప్రాప్తి కొరకు రెండు మార్గాల గురించి ఇంతకు ముందే నేను నీకు తెలిపితిని. సాంఖ్యులకు ఆత్మ తత్త్వం అను జ్ఞానయోగం ద్వారా మరియు యోగులకు భక్తి భావనగు కర్మయోగం ద్వారా భగవత్ సిద్ధి కలుగును.