శ్లోకం - 4

న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషో௨శ్నుతే | న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మానవుడు కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మఫలముల నుండి విముక్తి లభించదు. అలాగే ప్రాపంచిక సుఖములను త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన జ్ఞాన సిద్ధిని పొందలేడు.