శ్లోకం - 5
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ | కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రతి జీవుడూ కూడా క్షణ కాలమైనను కర్మలు చేయకుండా ఉండలేరు. అందరూ ప్రకృతి గుణాలైన త్రిగుణములచే ప్రభావితులై కర్మలు చేస్తూనే ఉన్నారు.