శ్లోకం - 7
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే௨ర్జున | కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఎవరైతే తమ ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి ప్రాపంచిక సుఖములయందు ఆసక్తి లేకుండా ఫలితములు గురించి ఆలోచించకుండా కర్మ యోగమును ఆరంభించునో అతడు శ్రేష్ఠుడు.