శ్లోకం - 8

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదాలలో వివరించిన విధంగా నీ కర్తవ్యమును నిర్వర్తించు. కర్తవ్యాన్ని విడిచిపెట్టడం కంటే నెరవేర్చడం శ్రేయస్కరం. కర్మలు చేయక పోవడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.