శ్లోకం - 9
యజ్ఞార్థాత్ కర్మణో௨న్యత్ర లోకో௨యం కర్మబంధనః | తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ జీవులకు సంసార బంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ అర్జునా, నీ కర్మలను నిస్వార్థంగా, ఫలితములపై ఆసక్తి లేకుండా అంకితభావంతో నిర్వర్తించు.