శ్లోకం - 10
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష వో௨స్త్విష్టకామధుక్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పూర్వ కాలమున బ్రహ్మదేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పెను, "ఈ పవిత్ర యజ్ఞాలు చేయడం ద్వారా మీరు వృద్ధి చెందుతారు మరియు యజ్ఞాలు మీ కోరికలను నెరవేరుస్తాయి."