శ్లోకం - 11

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః | పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మీరు యజ్ఞాలతో దేవతలను ఆరాధించడం వలన వారు సంతృప్తి చెందుతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా దేవతల మరియు మానవుల పరస్పర సహకారం వలన మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది.