శ్లోకం - 12

ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః | తైర్దత్తానప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞములతో పూజింపబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తారు. ఇలా వచ్చిన సుఖభోగములను అనుభవిస్తూ దేవతలకు తిరిగి ఆ సంపదలో కొంత కూడా నివేదించని వారు నిజంగా దొంగలే.