శ్లోకం - 13

యజ్ఞశిష్టాశినః స్సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః | భుఞ్జతే తే త్వఘం పాపాః యే పచంత్యాత్మకారణాత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించగా మిగిలిన పదార్ధాలను సేవించే వారికి అన్ని పాపాముల నుండి విముక్తి లభించును. ఎవరైతే తమ కోసం మాత్రమే వంట చేసుకొని తినే వారు పాపం పొందుతారు.