శ్లోకం - 14

అన్నా ద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః | యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అన్ని జీవుల మనుగడ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, ఐతే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది. యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది. సత్కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది.