శ్లోకం - 15
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ | తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్కర్మలకు మూలం భగవంతునిచే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకొనుము. అందుచేత, సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యం యజ్ఞములయందు స్థితుడై ఉంటాడు.