శ్లోకం - 18
నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన | న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అలాంటి ఆత్మజ్ఞానులకు ఈ లోకం నందు కర్మలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఎలాంటి కర్మలు చేయకపోయినను వారికి ఏ దోషమూ కలగదు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు.