శ్లోకం - 19
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర | అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అందుచేత మానవుడు ఫలితాలతో సంబంధం లేకుండా కర్మలను శ్రద్ధతో కర్తవ్యంగా ఆచరించాలి. ఫలములపై ఆసక్తి లేకుండా కర్మలు చేయడం ద్వారా మానవుడు పరమాత్మను పొందవచ్చు.