శ్లోకం - 21
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః | స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహనీయుడైన వ్యక్తి చేసే పనులను సామాన్యులు కూడా అనుకరిస్తారు మరియు ఇట్టి వ్యక్తి దేనినైతే ప్రమాణంగా గ్రహించి ఆచరిస్తాడో సామాన్య జనులు కూడా దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు.