శ్లోకం - 22

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన | నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, ఈ మూడు లోకాల్లో నేను చేయవలసిన ఎటువంటి కర్తవ్య కర్మలు లేవు, కోరికలు లేవు మరియు సాధించాల్సిన లక్ష్యాలు లేవు. అయినప్పటికీ నేను చేయవలసిన కర్మలు నిత్యం చేస్తూనే ఉంటాను.