శ్లోకం - 23

యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః | మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, నేను నా కర్మలను జాగ్రత్తగా ఆచరించనిచో అది లోకానికి మంచిది కాదు. ఏలనగా ప్రజలందరూ కూడా వారి కర్మలను సక్రమంగా నిర్వర్తించకుండా నన్నే అనుకరిస్తారు.