శ్లోకం - 26
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినామ్ | జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవర పెట్టకూడదు. బదులుగా, ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానలు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి.