శ్లోకం - 27
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః | అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను, ఆత్మ జ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని బావించును.