శ్లోకం - 29
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు | తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని ఉపదేశించాలేగాని బలవంతంగా ప్రభావితం చేయరాదు.