శ్లోకం - 30

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా | నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి, సంపూర్ణ ఆత్మ జ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా స్వలాభం గురించి ఆలోచించకుండా మనస్సులోని దుఃఖము వీడి నిశ్చింతగా యుద్ధం చేయుము.