శ్లోకం - 31
యే మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః | శ్రద్ధావంతో௨నసూయంతః ముచ్యంతే తే௨పి కర్మభిః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి, అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరం పాటించేవారికి కర్మ బంధముల నుండి విముక్తి లభిస్తుంది.