శ్లోకం - 32

యే త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతమ్ | సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను ఉపదేశించిన వాటిలో లోపాలని వెతుకుతూ అనుసరించని అవివేకులు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు.