శ్లోకం - 34

ఇంద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ | తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి. వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఈ రాగ ద్వేషములు మానవులకు బద్ధశత్రువులు.