శ్లోకం - 40
ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్ఠాన ముచ్యతే | ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్థావరాలు. కామం ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును కప్పేసి వారిని కలవర పెడుతుంది.