శ్లోకం - 42

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః | మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఇంకా గొప్పది. బుద్ధి కంటే ఆత్మ మరింత గొప్పది.