శ్లోకం - 1
శ్రీ భగవానువాచ: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్ | వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే௨బ్రవీత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వినాశనం లేని ఈ కర్మ యోగ శాస్త్రము గురించి నేను సూర్య భగవానుడైన వివస్వానుడికి ఉపదేశించాను. సూర్యుడు తన కుమారుడైన వైవస్వత మనువుకు, మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశించారు.