శ్లోకం - 2
ఏవం పరంపరా ప్రాప్తమ్ ఇమం రాజర్షయో విదుః | స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా)! తరతరాలుగా వస్తున్న ఈ కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకుని ఆచరించారు. కానీ కాలక్రమేణా అది ఈ భూలోకంలో కనుమరుగైంది.