శ్లోకం - 4

అర్జున ఉవాచ: అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః | కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు సూర్యుడు పుట్టిన ఎన్నో ఏళ్లకు జన్మించావు. అలాగైతే సూర్యుడి తరువాత పుట్టిన నీవు అతనికి ఈ జ్ఞానాన్ని అందించినది నువ్వే అనే వాస్తవాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలను?