శ్లోకం - 5
శ్రీ భగవానువాచ: బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున | తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పరంతపా(అర్జునా)!, మనం ఇద్దరం ఎన్నో జన్మలు గడిపాము. అన్ని జన్మలు కూడా నాకు గుర్తున్నాయి, కానీ నీకు అవి గుర్తుండవు.