శ్లోకం - 11
యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్ | మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నా భక్తులు ఎలాగైతే నన్ను ఆరాధిస్తారో వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యులందరూ అన్ని విధములా నా మార్గమే అనుసరిస్తారు.