శ్లోకం - 12

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః | క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకమున కర్మలకు ఫలములు త్వరగా సిద్ధిస్తాయి. కాబట్టి మానవులు తమ కోరికలు త్వరగా తీరాలని దేవతలను పూజిస్తారు.