శ్లోకం - 20
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః | కర్మణ్యభిప్రవృత్తో௨పి నైవ కించిత్ కరోతి సః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ ఫలాల యందు ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటూ, దేనిమీద ఆధారపడే అవసరం లేకుండా కర్మలు చేస్తున్నప్పటికీ, నిజానికి కర్మలు కొంచెం కూడా చేయని వాడే అవుతాడు.