శ్లోకం - 26

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి | శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు శ్రోత్రము మొదలైన ఇంద్రియములను ఆత్మ నిగ్రహం అనే అగ్నిలోనూ, మరికొందరు శబ్దం మొదలగు ఇంద్రియ తృప్తి నిచ్చే విషయములను ఇంద్రియములు అనే అగ్నిలో ఆహుతిగా సమర్పిస్తున్నారు.