శ్లోకం - 32
ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే | కర్మజాన్ విద్ధి తాన్ సర్వా ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విధంగా వేదాలు ఎన్నో రకాల యజ్ఞాల గురించి వివరించాయి, అవన్నీ వివిధ కర్మల నుండి పుట్టినవని అర్థం చేసుకోని ఆచరించినట్లైతే సంసార బంధముల నుండి విముక్తి పొందుతారు.