శ్లోకం - 38
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే | తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకంలో జ్ఞానంతో సమానమగు పవిత్రమైనది వేరే ఏదీ లేదు. అలాంటి జ్ఞానమును పొందినవాడు కాలక్రమములో అతని ఆత్మలోనే ఆ జ్ఞానమును తనంతటతానే పొందుచున్నాడు.