శ్లోకం - 42
తస్మాదజ్ఞానసంభూతం హృత్‌స్థం జ్ఞానాసినాత్మనః | ఛిత్త్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక ఓ అర్జునా, జ్ఞానమనే ఖడ్గాన్ని స్వీకరించి నీ హృదయంలో అజ్ఞానం వల్ల పుట్టిన సందేహాన్ని నరికివేసి, లేచి కర్మ యోగమును ఆచరించుము. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, యుద్ధం చేయుము.