శ్లోకం - 1

అర్జున ఉవాచ: సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి | యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, ఒకసారి కర్మసన్యాసమును(పనులను త్యజించడం), మరొకసారి కర్మయోగమును(భక్తితో పనిచేయడం) ప్రశంసించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఉన్నతమైనదో నాకు తెలియచేయుము.