శ్లోకం - 2
శ్రీ భగవానువాచ: సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ | తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మసన్న్యాసము మరియు కర్మయోగము అను ఈ రెండు మార్గాలను అనుసరిస్తూ మోక్షాన్ని పొందవచ్చు. కానీ, కర్మసన్న్యాసము కంటే కర్మయోగమే ఉన్నతమైనది.