శ్లోకం - 4
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః | ఏకమప్యాస్థిత స్సమ్యక్ ఉభయోర్విందతే ఫలమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అవివేకులు మాత్రమే జ్ఞానము మరియు కర్మ యోగము వేర్వేరు అని చెప్తారు. కానీ, వివేకులు అవి వేరుకావు అని గ్రహించి వాటియందు ఏ ఒక్కదానినైనను సంపూర్నంగా ఆచరించి ముక్తిని పొందుచున్నారు.