శ్లోకం - 12

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ | అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ యోగులు అన్ని కర్మ ఫలములను భగవంతునికి అంకితం చేసి శాశ్వత శాంతిని పొందుతారు. అలాకాకుండా కోరికలు మరియు స్వలాభం కోరుకునే వారు భౌతిక ఫలితాలపై ఆసక్తితో కర్మ బంధములలో చిక్కుకుంటారు.